తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు సోమేశ్ కుమార్, నీలం సహానీలు శుక్రవారం భేటీ అవ్వనున్నారు. ఇటీవల ఏపీ,తెలంగాణ సీఎంల సమావేశం అనంతరం శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశం కానుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో విభజన సమస్యలతో పాటు గోదావరి, కృష్ణా నదీజలాల అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న 9,10 షెడ్యూల్ సంస్థల విభజన సమస్యల పై కూడా చర్చలు జరగనునున్నాయి.
అలాగే ఏపీలో పనిచేసే తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి వచ్చే విధంగా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.