తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశాల్లో సమావేశాల ఎజెండా, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను అధికారికంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం అధికారులు చెప్తున్న ప్రకారం… ఈ నెల 16న రెండు సభల్లోనూ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టి దివంగత సభ్యులకు నివాళులర్పిస్తారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, 18న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత 20 నుంచి బడ్జెట్పై చర్చ ఉంటుంది. మొత్తం 2 వారాల పాటు సమావేశాలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది.5 నెలల తర్వాత మళ్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ఈసారి ప్రభానంగా కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణపైనే చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు, పెట్రో ధరల పెంపు వంటి అంశాలు అధికార పార్టీ ఎజెండాలో భాగం కానున్నాయి. ఇక విపక్ష కాంగ్రెస్, బీజేపీలు వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. ధరణి, ఎల్‌ఆర్‌ఎస్ సమస్యలు, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని కార్నర్ చేయనున్నాయి. .ఈసారి సమావేశాలు హాట్ హాట్‌గా నడిచే అవకాశం ఉంది