తెలంగాణ అసెంబ్లీ వద్ద పెను ప్రమాదం తప్పింది. అసెంబ్లీ పాత భవన్ మినార్ డిజైన్‌లో కొంత భాగం కూలిపోయింది. తూర్పు వైపు ఎలివేషన్ పెద్ద శబ్దం చేస్తూ కిందపడింది. భారీ శబ్ధం రావడంతో అసెంబ్లీ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. కూలిన ప్రదేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కార్యాలయం ఉంటుంది. అయితే శిథిలాలు గార్డెన్ ఏరియాలో పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ పాత భవన శిథిలావస్థకు చేరుకుంది. రిపేర్లు ఉన్న చోట మరమ్మతులు చేస్తూ అసెంబ్లీ అధికారులు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.