ప్రతిపక్షాలకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అసెంబ్లీని 25 రోజుల పాటు నిర్వహించాలన్న ప్రతిపక్షాల అభ్యర్థనను సర్కార్ పక్కన పెట్టింది. ఈ నెల 12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 6న బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
7న అసెంబ్లీకి సెలవు ఉండనుంది. తిరిగి 8న బడ్జెట్ పై సభలో సాధారణ చర్చ జరగనుంది. అలాగే 9, 10, 11 మూడు రోజుల పాటు పద్దులపై చర్చ జరుగనుంది. 12న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.
కాగా అసెంబ్లీ సమావేశాలు 25 రోజుల పాటు కొనసాగించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం నిర్వహించిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే ఎంఐఎం సైతం సభను 20 రోజుల పాటు కొనసాగించాలని పట్టుబడింది.
సమావేశాల కొనసాగింపు 8న నిర్ణయిం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడంపై ప్రతిక్షాలు మండిపడుతున్నాయి. అయితే కేవలం ఆరు రోజుల పాటు సభను నిర్వహించడంపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.