తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల కార్యదర్శి నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
అదే రోజు శాసనసభ, శాసన మండలిలను ఉద్దేశించి ఉదయం 11 గంటలలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.