కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు కీలక భేటీ జరుగుతోంది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభమైంది. తెలంగాణలో ఈ ఏడాది చివర్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ క్రమంలో ఎన్నికలకు పార్టీ సంసిద్ధతపై రాష్ట్ర నేతలతో అమిత్ షా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో మిషన్ 30, ఎన్నికల ప్రణాళికలపై రాష్ట్ర నేతలకు అమిత్ షా సూచనలు చేస్తారి తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై జేపీ నడ్డా, అమిత్ షా వారికి సూచనలు ఇస్తున్నట్టు సమాచారం.
సమావేశానికి ముందు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడారు. ఇదేమీ అత్యవసర సమావేశం కాదని తెలిపారు. ఇలాంటి సమావేశాలు జరుగుతూనే ఉంటాయని, ఈ సమావేశానికి జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, లక్ష్మణ్ పార్టీ ముఖ్య నేతలు మురళీధర్ రావు, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు.
ఢిల్లీ లిక్కర్ కుంభ కోణంలో మనీశ్ సిసోడియా నేపథ్యంలో సమావేశం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ప్రధానంగా చర్చి స్తారని సమాచారం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది.