హైదరాబాద్ లోని ఓవైసీ ఆసుపత్రిని కరోనా వైరస్ నివారణకు ఐసోలేషన్ వార్డుల కోసం ఉపయోగించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మైనారిటీ ఓట్లతో పబ్బం గడుపుకునే ఎంపీ ఓవైసీ… గాంధీలో దాడిని ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు.
కరోనా బారిన పడిని ముస్లీంల రక్షణ కోసం… వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ఓవైసీ, మజ్లిస్ చేసిన కార్యక్రమాలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కరోనా నివారించడానికి కృషి చేస్తున్న ప్రధాని మోడీపై ఓవైసీ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.