తెలంగాణ ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. రూ.2,90,396 కోట్లతో ఈ సారి బడ్జెట్ ను సభ ముందు ఉంచారు. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోందంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన హరీష్.. రెవెన్యూ వ్యయం రూ.2,11, 685 కోట్లుగా చెప్పారు.
శాఖలవారీగా కేటాయింపులు
– నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు
– విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు
– ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
– ఆయిల్ ఫామ్ కు రూ.వెయ్యి కోట్లు
– దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు
– ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
– గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు
– బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు
– వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు
– కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు
– షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు
– పంచాయతీ రాజ్ కు రూ.31,426 కోట్లు
– వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు
– విద్యా రంగానికి రూ.19,093 కోట్లు
– రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు
– హరిత హారం పథకానికి రూ.1,471 కోట్లు
– పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
– రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
– పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
– హోంశాఖకు రూ.9,599 కోట్లు
– మహిళా శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు
– మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
– రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు
– రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు
– కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ కోసం రూ.200 కోట్లు
– పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కోసం రూ.4,834 కోట్లు
– డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి రూ.12వేల కోట్లు
– ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1,463 కోట్లు
– ప్రణాళిక విభాగానికి రూ.11,495 కోట్లు
– ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖకు రూ.366 కోట్లు
– ఉన్నత విద్యాశాఖకు రూ.3,001 కోట్లు
– న్యాయశాఖకు రూ.1,665 కోట్లు
– కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ.వెయ్యి కోట్లు
– జర్నలిస్టుల సంక్షేమానికి రూ.వంద కోట్ల కార్పస్ ఫండ్