తెలంగాణలో నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 12.10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఏసీ సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు. ఈ నెల 5న కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలోనే బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనున్నారు. ఎన్నికల బడ్జెట్ కావడంతో సమావేశాలని ఎలా ఉపయోగించుకోవలనే విషయంపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
కేబీనెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ నాందెడ్ వెళ్లనున్నారు. ఈ నెల 6న ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. పది రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.