ప్రగతి భవన్ లో కెసిఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం ౩గంటలకు మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ఆర్టీసీ అంశంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది . ఒకవైపు మొండి వైఖరితో ఉన్న ప్రభుత్వానికి హై కోర్ట్ చుక్కలు చూపిస్తోంది .తప్పుడు లెక్కలతో కోర్ట్ ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్ట్ . న్యాయస్థానం ఆదేశాలను పక్కన పెడుతూ ప్రభుత్వం చర్చలు జరపకుండా కాలయాపన చేస్తోంది .ఆర్టీసీ ముగింపే, ఆర్టీసీ సమ్మె కు సమాధానం అనడం తో తెలంగాణ సమాజం భగ్గుమంటోంది .
ఈ సమయంలో జరగుతున్న కాబినెట్ సమావేశం కావడంతో అందరి దృష్టి ఈ సమావేశం పైనే పడింది .కానీ ప్రభుత్వ వైఖరిలో ఎలాటి మార్పు లేదు . ఇవాళ్టి సమావేశంలో మూడు నుండి 4 వేలరూట్లలో ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇవ్వాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది .మొత్తం 30 అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది .