ఈనెల 9వ తేదీన తెలంగాణ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చంచి, నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలతో పాటు రాబోయే ఎన్నికల అంశాన్ని సైతం కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలన్న దానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది ఉత్కంఠగా మారింది.