పాత సచివాలయం కూల్చివేసిన తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణానికి రెడీ అయ్యింది. ఇందుకోసం రోడ్లు భవనాల శాఖ టెండర్లు పిలిచింది. మొదట 400కోట్ల అంచనా ఉన్నప్పటికీ దీన్ని 700కోట్లకు పెంచినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బీ టెండర్లు పిలవటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
టెండర్ల ప్రాసెస్ ఇలా
శుక్రవారం నుండి అక్టోబర్ 1 సాయంత్రం 4 గంటల వరకు టెండర్లను స్వీకరిస్తారు.
ఈ నెల 26న ప్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తారు.
అక్టోబర్ 1న సాయంత్రం 4:30కి టెక్నికల్ బిడ్స్ వేస్తారు.
అక్టోబర్ 5న మధ్యాహ్నం 3 గంటలకు ఎర్రమంజిల్ ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ కార్యాలయంలో ప్రైస్ బిడ్స్ వేస్తారు.