హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గింది. ఆర్థిక మాంద్యం వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీయం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లు ఉందని వివరించారు. బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.08 కోట్లుగా వుందని తెలిపారు. రెవెన్యూ వ్యయం రూ.1,11,055 కోట్లు, మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లు అని చెప్పారు.
2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,46,492.3 కోట్లతో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ను సీయం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది.
ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయ్యిందని ఈ సందర్భంగా కేసీఆర్ ఘనంగా చెప్పుకున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు దక్కిన మూలధన వ్యయ వాటా తక్కువ ఉండేదని వ్యాఖ్యానించారు. తమ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయని కేసీఆర్ చెప్పుకోవడం ప్రతిపక్షాలకు అస్త్రం దొరికినట్టయ్యింది. యూరియా పంపిణీలో ప్లానింగ్ లేకపోవడం వల్ల తెలంగాణాలో ఇటీవలే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వైద్య సదుపాయాలు అందక తెలంగాణా అంతటా విషజ్వరాలు ప్రబలి జనం ఇబ్బంది పడుతున్నారు. బడ్జెట్ ప్రసంగంలో మాత్రం కేసీఆర్ పాలన సూపరెహె అని చెప్పుకోవడం ఆశ్యర్యం.