2015లో ఎల్.ఆర్.ఎస్ అప్లై చేసిన దరఖాస్తులకే దిక్కులేదు… కొత్తగా వచ్చిన 25లక్షల దరఖాస్తులు ఎప్పుడు పరిశీలిస్తారు? మూడు నెలల నుండి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు మళ్లీ మొదలైనా ఎల్.ఆర్.ఎస్ ఇబ్బందితో ఆ జోష్ కనపడటం లేదా…? ధరణి వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు అంటూ చేతులు కాల్చుకున్న సర్కార్ ఎల్.ఆర్.ఎస్ పై పునరాలోచనలో పడిందా…?
ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం వస్తోంది. రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయినా అంతంతమాత్రంగానే ఉండటం, ప్రజల్లో పెరిగిపోతున్న అసహనం, పాత, కొత్త ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిశీలనకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చే సూచనలు కనపడుతున్నాయి.
ఎల్.ఆర్.ఎస్ ను పక్కనపెట్టి సర్కార్ పెట్టే కండిషన్స్ ఇవే…?
ఎల్.ఆర్.ఎస్ తప్పనిసరి అనే అంశాన్ని పక్కనపెడుతూనే కొన్ని కండిషన్స్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
1. తమ స్థలం నాలా లేదా శిఖం లేదా ప్రభుత్వ భూమి లేదా చెరువు ప్రాంతంలో లేదని కొనుగోలు దారుడితో పాటు అమ్మకం దారుడు అఫిడవిట్ ఇవ్వటం
2. గతంలో రిజిస్ట్రేషన్లు అయిన ఎల్.ఆర్.ఎస్ లేని ప్లాట్లకు యాధావిధిగా రిజిస్ట్రేషన్లు చేస్తూ భవన నిర్మాణ సమయంలో క్రమబద్ధీకరణ చార్జీలు, నాలా చార్జీలు వసూలు చేయటం
3. కనీసం ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానీ ఎల్.ఆర్.ఎస్ లేని భూములను పూర్తిగా పక్కనపెట్టడం
అయితే, ఈ అంశాలపై త్వరలోనే సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.