కుక్క…తోకను ఊపుతుందా.. లేక తోక… కుక్కను ఊపుతుందా… ? అంటూ కేసీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగుల మీద కోపంతో ఊగిపోయారు. తమని కుక్క… తోక… లతో పోల్చడాన్ని ఉద్యోగులు చాలా తీవ్రంగా తీసుకున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలు భగ్గుమంటున్నాయి.
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా వారిని హెచ్చరించారు. ఆదివారం అసెంబ్లీ ప్రభుత్వ ఉద్యోగుల అంశంపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఉద్యోగులు డిక్టేట్ చేయలేరని అంటూ కోపంతో ఊగిపోయారు. ప్రభుత్వం నిర్ధేశించిన పనులను ఉద్యోగులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘కుక్క.. తోకను ఊపుతుందా? లేక తోక.. కుక్కను ఊపుతుందా?’’ అంటూ ఉద్యోగుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిచ్చి మాటలు నమ్మి సమ్మెలు చేయడం సరికాదని ఉద్యోగులకు సీఎం హితవుచెప్పారు