కరోనాపై బెంగాల్ ఎలా చేతులు కాల్చుకుందో దేశం మొత్తం చూసింది. కేసులను తక్కువగా చూపుతూ, మరణాల సంఖ్యను తగ్గిస్తూ చూపారని కేంద్ర సంస్థలు నేరుగానే రిపోర్ట్ ఇచ్చాయి. ఇప్పడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి రాబోతుందా…? బెంగాల్ దీదీని ఫాలో కేసీఆర్ చేతులు కాల్చుకోబోతున్నాడా…?
తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగా ఉందని, తక్కువ టెస్టులు చేస్తూ… కేసులు తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటి వరకు కేవలం పొలిటికల్ విమర్శలుగానే ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ప్రముఖ డాక్టర్లు కూడా ఇప్పుడు ఇదే ప్రశ్నలు వేయటం సంచలనంగా మారుతోంది.
కొంతమంది ప్రముఖ డాక్టర్లు కలిసి ఏర్పాటు చేసుకున్న డాక్టర్స్ ఫర్ సేవ అనే ఆర్గనైజేషన్ తరుఫున ఇటీవల రాష్ట్రంలో పర్యటించి వెళ్లిన కేంద్ర బృందానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ మరణాలను, కేసులను తగ్గించి చూపిస్తున్నారని ఆ ఫిర్యాదు సారాంశం. పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ సంతోస్ క్రాలేటి, సీనీయర్ పిడియాట్రిషన్ విజయానంద్ జంపూరి, ఆర్థోపెడిక్ డాక్టర్ వేదప్రకాష్ తదితరులు టెస్టులు చేయకపోవటంపై అనుమానం వ్యక్తం చేశారు.
ఇక, కరోనా లక్షణాలతో చనిపోయిన వ్యక్తులకు ఎవరికీ కరోనా టెస్టులు చేయరాదని, రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్స్ కు తప్పా సెకండరీ కాంటాక్ట్స్ కు కరోనా టెస్ట్ చేయకూడదని నిర్ణయం తీసుకోవటం… స్వయంగా డీఎంఈ ఆదేశాలివ్వటంపై కూడా అనేక అనుమానాలను వ్యక్తపర్చారు.
ఇక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ కూడా… తెలంగాణలో ప్రైవేటు హెల్త్ సంస్థలను వాడుకోలేకపోవటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణలో దాదాపు 60-70శాతం మందికి ఎలాగూ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని, కేవలం 20-30శాతం మందికే లేదని… అలాంటప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం ఎందుకు చేయించటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సరిపడా టెస్టింగ్ కిట్స్ లేకపోవటం కూడా టెస్టులు తక్కువగా చేయడానికి కారణమని ఆయన అంచనా వేశారు. రాష్ట్రంలో ఓ 80 ఏళ్ల వృద్ధుడు న్యూమోనియాతో కరోనా లక్షణాలతో కోవిడ్ ఆసుపత్రిలో మరణిస్తే… కరోనా మరణం అని ప్రకటించి, డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారని… కానీ ఏప్రిల్ 26-28మధ్య ఆ మరణాన్ని ప్రకటించలేదని వారు ఆరోపించారు. ఇలా ఎందుకు దాయటమని ప్రశ్నించారు.