సీయం కేసీఆర్ ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ ఫార్మూలాని ఫాలో అయ్యారు. యురేనియం తవ్వకాలపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని చెప్పారు.
హైదరాబాద్: నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేశారు. యురేనియం తవ్వకాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు సభలో సోమవారం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. కేంద్రం వినకపోతే కలిసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే యురేనియం తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. నల్లమల అడవులను నాశనం కాకుండా కాపాడుతామని చెప్పారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించారు.