తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం సమ్మక సారలమ్మ ను దర్శించకున్నారు. వన దేవతలకు నిలువెత్తు బంగారం(బెల్లం), పట్టు వస్తాలను కానుకలుగా సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. దర్శనానంతరం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీఎం కేసీఆర్ కు సమ్మక్క-సారలమ్మ దేవతల ఫోటోను అందించారు. సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ సంతోష్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పలువురు ప్రముఖులు శుక్రవారం వనదేవతలను దర్శించుకున్నారు.