హుజుర్‌నగర్ ఉపన్నికను అటు ఉత్తమ్, ఇటు కేసీఆర్ ఇద్దరు ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. టీఆరెస్ తనకున్న అధికార బలంతో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు వరసగా నాలుగుసార్లు గెలిచిన నియోజకవర్గం కావడంతో ఉత్తమ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దీనితో అక్కడ రాజకీయ వాతావరణం హిట్ ఎక్కింది.
గతంలో ఎప్పుడు లేనివిధంగా కులలవారీగా, గ్రామాల వారిగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు పరిమితి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇంచార్జ్‌లను నియమించారు. వందలాది మంది టీఆరెస్ నాయకులు హుజుర్‌నగర్‌లో మకాం వేశారు. ఏ గ్రామంలో చూసినా చుట్టుపక్కల కోదాడ, మిర్యాలగూడ, నల్గొండ.. ఇలా ఏ పట్టణంలో ఏ లాడ్జిలలో చూసినా టీఆరెస్ కార్యకర్తలు, నాయకులే కనపడతున్నారు. అక్కడే కాదు ప్రైవేట్ గెస్ట్ హౌజ్, ఫామ్ హౌజ్‌లలో కూడా వారే కనపడతారు. దీనిని బట్టి టీఆరెస్ ఈ ఎన్నికను ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థం అవుతుంది. మరోవైపు ఉత్తమ్ కూడా చమటోడుతున్నాడు. కాంగ్రెస్ దిగ్గజాలందరినీ ఒక్క వేదిక మీదకు తెచ్చేందుకు కష్టపడుతున్నాడు. నిధులు సమకూర్చుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాడు. టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజుర్‌నగర్‌లో పనిచేస్తున్న ఇంచార్జ్‌లతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారంటే ఈ ఉపఎన్నికని ఎంత సీరియస్‌గా తీసుకుందో తెలుసుకోవచ్చు. సర్వేలలో టీఆరెస్‌కు ఏబై నాలుగు శాతం విజయావకాశం ఉంది అని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌లో కేటీఆర్ చెప్పాడు. కానీ ఎందుకో టీఆరెస్‌ని ఉపఎన్నిక భయం వెంటాడుతుందా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే సీపీఐ మద్దతు కోరడం కానీ, ఇంతమంది ఇంచార్జ్‌లను నియమించడం కానీ, టెలీకాన్ఫరెన్సులు నిర్బహించడం కానీ, ఎన్నికలలో పనిచేయడానికి వెళ్లినవారికి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం చూస్తూ వుంటే అందరికీ ఒక డౌటయితే తప్పకుండా వస్తుంది, టీఆరెస్‌ను ఏదో భయం వెంటాడుతోందని !