కరోనా మే 31వరకు తెలంగాణ లాక్ డౌన్ పొడిగింపు
కంటైన్మెంట్ జోన్లు తప్పా… అన్నీ జోన్లను గ్రీన్ జోన్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కంటైన్మెంట్ జోన్ అంటే ఎంత ఉంటుంది అనేది మార్గదర్శకాలున్నాయి
హాట్ స్పాట్ ఏరియా మినహా అన్నీ గ్రీన్ జోన్స్
వీటికి పోలీసు పహారా ఉంటుంది… అన్నీ అవసరాలను ప్రభుత్వమే డోర్ డెలివరీ చేస్తుంది
1452 కుటుంబాలు ఒక్కో కంటైన్మెంట్ ఏరియాల్లో ఉంటాయి
ఎప్పట్లోగా కరోనా వ్యాక్సిన్, మందు వస్తుందో చెప్పే పరిస్థితి లేదు
కరోనాతో కలిసి జీవించటం నేర్చుకోవాల్సిందే, తప్పదు
బతుకును బంద్ చేసుకోని ఖాళీగా కూర్చోలేం
హైదరాబాద్ నగరం తప్పా అన్నీ రకాల షాపులు తెరుచుకోవచ్చు
హైదరాబాద్ నగరంలో కమీషనర్ ఆదేశానుసారం రోజు విడిచి రోజు షాపులు తెరుచుకోవచ్చు
సరి, బేసి విధానం ఉంటుంది
కంటైన్మెంట్ ఏరియాల్లో మినహాయింపులు ఉండవు
ఆర్టీసీ బస్సు ప్రయాణాలు మొదలవుతాయి
గ్రేటర్ లో బస్సులు, ఇతర రాష్ట్రాల బస్సులు నడవవు
ఆటోలు, ట్యాక్సిలు నడుస్తాయి
కార్లలో 1+3
ఆటోల్లో 1+2 కు అవకాశం
సెలూన్లు అన్నీ తెరుచుకోవచ్చు
ఆర్టీసీలో నిబంధనలు కఠినంగా పాటిస్తారు
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పనిచేసుకోవచ్చు
పరిశ్రమలు, ఫాక్టరీలు, మానుఫాక్చరింగ్ యూనిట్లు కూడా పనిచేసుకోవచ్చు
కర్ఫ్యూ రాత్రి పూట 7గంటల నుండి ఉదయం 6గంటల వరకు ఉంటుంది
అన్ని మతాల ప్రార్థనాలయాలు, ఉత్సవాలకు అనుమతి లేదు
ఫంక్షన్ హాల్స్, మాల్స్, థియేటర్లకు అనుమతులు లేవు
సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదు
అన్ని రకాల విద్యాసంస్థలు మే 31వరకు తెరుచుకోవు
బార్స్, పబ్స్, క్లబ్స్, స్విమ్మింగ్ ఫూల్స్, జిమ్స్, పార్కులకు కూడా మినహాయింపులు లేవు
మెట్రో రైలుకు కూడా మినహాయింపు లేదు
ప్రజలందరికీ మాస్కులు తప్పనిసరి… లేదంటే 1000 రూపాయలు ఫైన్
భౌతిక దూరం కూడా ప్రజలంతా పాటించాల్సిందే
షాపు ఓనర్లు కస్టమర్లకు శానిటైజేషన్ చేయాలి
షాపుల్లోనూ కరోనా రూల్స్ పాటించాల్సిందే
అవసరం లేకున్నా రోడ్ల మీదకు రాకండి… తిరగబడితే మళ్లీ లాక్ డౌన్ ఉండొచ్చు
65 ఏళ్లు దాటిన వృద్ధులను, చిన్న పిల్లలను బయటకు రాకుండా కాపాడుకోవాలి
అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దు
ప్రజలు ఇప్పటి వరకు అద్భుతంగా సహకరించారు-ధన్యవాదాలు
ఇలాగే ఉండండి… త్వరలో మనం కరోనా నుండి బయటపడొచ్చు
స్వీయ నియంత్రణ పాటించి కరోనా బారిన పడకుండా కాపాడుకుందాం
తెలంగాణ వ్యవసాయ రాష్ట్రంగా అవతరించేందుకు పుష్కలమైన అవకాశం ఉంది
ఇలాంటి భూములున్న ప్రాంతాలు ప్రపంచంలోనే అరుదుగా ఉంటాయి
అందుకే ఇక్రిశాట్ పటాన్ చెఱుకు వచ్చింది
అన్ని రకాల నేలలున్న ప్రాంతం తెలంగాణ
సమ శీతోష్ణ మండలంలో తెలంగాణ ఉంది
ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావొస్తున్నాయి
వరదలు, తుఫానులు, ఈదురు గాలులు కూడా తెలంగాణలో చాలా తక్కువ
అందుకే వ్యవసాయంకు అనుకూలం
నైపుణ్యం గల వ్యవసాయదారులు తెలంగాణలో ఉన్నారు
తెలంగాణ రైతుబంధు, భీమా దేశంలోని ఏ రాష్ట్రంలో లేదు
24గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ
ఫ్రీగా సాగునీరు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమే
వ్యవసాయ క్లస్టర్స్ ఏర్పాటు చేశాం, ప్రతి క్లస్టర్ కు ఒక వ్యవసాయ అధికారిని నియమించాం
ఎరువుల కొరత లేకుండా చేశాం
కల్తీ విత్తన వ్యాపారుల మీద దేశంలో ఎక్కడా లేని విధంగా పీడీ యాక్ట్ పెడుతున్నాం
పాడిరైతులకు పశువులు, ప్రోత్సాహకాలు ఇవ్వటంలో ముందున్న రాష్ట్రం తెలంగాణ
నియంత్రిత విధానంలో పంటలు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుడుతున్నాం
తెలంగాణలో రికార్డు దిగుబడులు వస్తున్నాయి
రైతులు పండించిన మొత్తం ధాన్యం తెలంగాణ మాత్రమే కొంటుంది
మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటను పండించి లాభాలు తీసుకోవాలి
తెలంగాణలో 70లక్షల ఎకరాలకు మించి పత్తి పంట వేయాలి
40లక్షల ఎకరాల్లో వరి వేయాలి
వరి రకాలను కూడా ప్రభుత్వమే చెబుతుంది… అప్పుడే మద్ధతు ధర వస్తుంది
వర్షాకాలంలో మక్క పంటను వేయవద్దు, కంది, పత్తి వేసుకోవాలి
ప్రతి సంవత్సరం ప్రభుత్వం పంటలను కొనలేదు
25లక్షల టన్నులకు మించి మక్క దిగుబడి వచ్చినా లాభం లేదు
యాసంగిలో మక్కను పండిస్తే మంచి లాభాలు
కంది పంటను 15లక్షల ఎకరాల వరకు వేయవచ్చు
కంది పంటను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
మద్ధతు ధరతో కొంటాం
2లక్షల ఎకరాల్లో పండించే కూరగాయాలకు ఇబ్బంది లేదు
పసుపు పంట వేసుకోవచ్చు… ఇబ్బంది ఉండదు
ఎండు మిర్చి పంట వేసుకోవచ్చు… ఇబ్బంది ఉండదు
సోయాబీన్స్ పండించుకోవచ్చు
మామిడి తోటలు సహా ఇతర తోటలను సాగు చేసుకోవచ్చు
ప్రభుత్వం చెప్పిన వరి పంట వేయకుండా ఇతర పంటలు వేస్తే రైతుబంధు రాదు
తెలంగాణ సోనా అనే వరి రకానికి మంచి డిమాండ్ ఉంది
అమెరికాలో మంచి డిమాండ్ ఉంది
షూగర్ ఫ్రీ రైస్ గా మంచి పేరు ఉంది… అందుకే 10లక్షల ఏకరాల్లో పంట వేయబోతున్నాం
ఇదే అంశంపై హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం
కలెక్టర్లు, అధికారులు, రైతుబంధు నేతలతో ప్రత్యేక సమావేశం
అక్కడి నుండే రైతులకు ఏ పంట ఎవరు వేయాలనేది పిలుపు ఇస్తాం
ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్ఈజెడ్స్ ఏర్పాటు చేస్తున్నాం
మరో 45లక్షల గోదాంల నిర్మాణం చేస్తాం
అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ బాటలు వేసుకుంటుంది
ప్రతి నియోజవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నాం
రైతుల తలరాతను రైతే మార్చుకోవాలి
తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోంది
తెలంగాణ రైతులు అప్పుల్లేకుండా ఉండేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది
త్వరలో ఓ న్యూస్ ఛానెళ్ లో రైతులతో ముఖాముఖి
పనికాలిన వారు, వెదవలు మాట్లాడితే మేం పట్టించుకోం… ఆ అవసరం కూడా మాకు లేదు
కేంద్రం ఇచ్చిన ఆర్థిక ప్యాకేజి అంతా బోగస్ అని ప్రపంచ జర్నల్స్ తేల్చి చెప్పాయి
అంకెల గారడీ అని ప్రశ్నించాయి
తెలంగాణ పూర్తిస్థాయిలో కేంద్ర ప్యాకేజిని ఖండిస్తుంది
రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలంటే… రాష్ట్రాలను బిక్షగాళ్లలా భావించింది
ఇదేనా కేంద్రం చేసింది
2.5శాతం ఎఫ్ఆర్బీం పెంచింది కానీ ఎన్నోషరతులు పెట్టింది
దరిద్రపు ఆంక్షలు పెట్టినయి
ప్రతి సంస్కరణకు 2500కోట్లు ఇస్తారా…?
ఇది ప్యాకేజీయా అసలు…?
ఇది సమాఖ్య స్ఫూర్తేనా…?
మున్సిపాలిటీల్లో ప్రజలపై భారం పెంచితే 2500కోట్లు ఇస్తారా…?
వన్ నేషన్-వన్ రేషన్ అని చెప్పారు
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మేమే ఛాంపియన్
కేంద్రం ఇచ్చింది ప్యాకేజీ కాదు పచ్చి మోసం, దగా, మోసం
ఇది కేంద్రం తన పరువు తానే తీసుకుంది
కేంద్రం ప్యాకేజీ పెద్ద బోగస్
ఇది సమాఖ్య వ్యవస్థకే విఘాతం
ఇది ఫెడరలిజమా…?
ఇదేమన్నా పిల్లల కొట్లాటనా…?
మెడ మీద కత్తి పెట్టి మేం చెప్పింది చేస్తే బిక్షం ఇస్తా అంటారా…?
కేంద్ర విధానం సరైంది కాదు
రాష్ట్రం కట్టుకునే అప్పుకు కేంద్రం షరతులేందీ…?
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యంగబద్ద ప్రభుత్వాలే
కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలకే ప్రజలకు ఎక్కువ జవాబుదారీగా ఉంటాయి
ఏపీ ప్రభుత్వ విధానంపై ఇప్పుడే మేం మాట్లాడదల్చుకోలేదు
మా వాటాలపై మాకు స్పష్టమైన అవగాహాన ఉంది
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణకు ఇచ్చిన కేటాయింపుల మేరకు ప్రాజెక్టులు తెలంగాణ కడుతుంది
ప్రతిపక్షం ఎవడు…? నీళ్ల గురించి కేసీఆర్ పై మాట్లాడుతారా…?
ప్రతిపక్షాలు ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నాయి
మేం వివాదాలకు పోదల్చుకోలేదు
ఎక్కడి ప్రజలైనా ప్రజలే
రాయలసీమకు నీరు పోవాలి అన్నాను… నేను ఇప్పుడు కూడా చెబుతున్నా.
గోదావరి నుండి సముద్రంలో కలిసే నీరును వాడుకోమని ఏపీకి చెప్పిన
బేసిన్లు లేవు భేషజాలు లేవు అని నేనే పిలిచి ఏపీ మంత్రులకు భోజనం పెట్టి చెప్పిన
చంద్రబాబు తొడగొట్టి పోయి ఏం తెచ్చిర్రా…?
మంచిగా మాట్లాడి నీరు తెచ్చుకోవాలి… అలాగే చేయమని ఏపీకి చెప్పిన
కాదు అంటే తేడా వస్తది
గోదావరి జలాలను ఏపీ వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు
చిల్లర పంచాయితీలు వద్దు అని చెప్పినం
ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం
పన్నుల రూపంలో తీసుకోకుండా సెస్ రూపంలో కేంద్రం తీసుకుంటుంది
ఇది నిజమా కాదా కేంద్రం చెప్పాలి
గోదావరిలో మా వాటా పోను… 650టీఎంసీల మిగులు జలాలు కావాలని కేంద్రాన్ని అడుగుతున్నాం
ఏపీ, తెలంగాణకు వివాదాలు లేవు
కలిసే పనిచేస్తున్నాం
ఎవరికైనా కళ్లు మండుతున్నయా…?
ఎవరు ఎక్కడికైనా పోవచ్చు
బస్సులన్నీ ఓపెన్ అయినాయి
గ్రీన్ జోన్లలో సడలింపులు ఇచ్చినా కొత్త కేసులు రాలేదు
అలాగే ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది అనుకుంటున్నాం
కంటైన్మెంట్ ఏరియాల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తాం
హైదరాబాద్ లోనూ మూడు, నాలుగు ఏరియాల్లోనే కరోనా కేసులు ఉన్నాయి
దేశం మొత్తం సడలింపులు ఇచ్చాక మనం ఇవ్వకపోతే ఆర్థికంగా వెనకబడతాం
కేసులు ఎక్కువైతే మళ్లీ లాక్ డౌన్
జిల్లాల నుండి హైదరాబాద్ కు బస్సులు వస్తాయి
కరోనా కేసులు లేని వైపు అనుమతి ఇస్తాం
రాత్రి 7గంటల్లోపే ప్రయాణాలు ముగియాలి… టికెట్లు ఉన్న వారికి కొంత సడలింపు, అనుమతులు ఇస్తాం
ప్రైవేటు బస్సులు, అన్ని సొంత వాహానాలు అన్నింటికి అనుమతి