తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా షెడ్యూల్ మాత్రం ఖరారు కాలేదు. జగన్ ఢిల్లీ టూర్ తరువాత కెసిఆర్ వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, ఇతరత్రా నిధుల విడుదల, విభజన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రధానిని కలుస్తానని సీఎం కేసీఆర్ చాలా రోజుల కిందటే ప్రకటించారు. ‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు ముందు ఆయన ఢిల్లీకి వెళ్లినా.. ఓ పెళ్లి విందుకు హాజరై తిరిగి వచ్చారు. అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతోనే ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలవలేకపోయారని అప్పట్లో టీఆర్‌ఎస్ వర్గాలు చెప్పాయి. మరి ఈసారైనా మోదీ తో భేటీ అవుతారో లేదో చూడాలి.