కరోనాకు చెక్ పెట్టేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడంతో.. దేశవ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూను పాటించారు. నిజానికి ఈ జనతా కర్ఫ్యూ అసలు ఉద్దేశ్యం సోషల్ డిస్టెన్సింగ్. ప్రజలంతా ఇంటికి పరిమితమై సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వలన కరోనాకు డెత్ వారెంట్ జారీ చేసినట్లు అవుతుందని భావించి మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుకు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు అనూహ్యరీతిలో స్పందించారు. చివరగా ఈ జనతా కర్ఫ్యూ విజయవంతమైన అనంతరం కరోనా ఇంతలా స్వైర వీహారం చేస్తోన్న ధైర్యం కోల్పోకుండా మొక్కవోని దీక్షతో వైద్య సేవలు అందిస్తోన్న వైద్యులకు చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయాలని సిఎం కేసీఆర్ శనివారం నాటి ప్రెస్ మీట్ లో తెలియజేశారు. జనతా కర్ఫ్యూను తప్పనిసరిగా పాటించాలని ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కటిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. ఈ విషయంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జనాల నుంచి ఆగ్రహం చవిచుస్తున్నారు.
ప్రతి అంశంలో సలహాలు సూచనలు చేసే కేసీఆర్.. వాటిని ప్రజలకు తెలియజేయడం మినహా వాటిని తూచా పాటించడంలో ఎప్పుడు వెనకంజలోనే ఉంటాడని మరోసారి నిరుపితమైంది. జనతా కర్ఫ్యూఅసలు విషయాన్నీ పక్కకు పెట్టి.. అంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా సమూహంతో ప్రగతి భవన్ లో 100 మందితో వైద్యులకు కృతజ్ఞతగా చప్పట్లు చరచడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చెప్పడం తప్ప పాటించడం కేసీఆర్ కు తెలియదని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తన నుంచి తెలంగాణ సమాజం ఇలాంటి అత్యుత్సాహ ప్రవర్తనను ఊహించలేదని అంటున్నారు. ఇలాంటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిపోయి … తెలంగాణా సమాజం అంత చూస్తుండగానే మీడియా ముంగట సామూహికంగా ఇలా వ్యవహరించడం జనాలకు తప్పుడు సందేశాలను అందించడమేనని విమర్శిస్తున్నారు. మీరంతా ఆరోగ్యవంతులు కావోచ్చు కాని సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే సమయంలో జగురకత అవసరమని అంటున్నారు. ఏపీ సిఎం జగన్ కుడా మంది మార్బలంతో వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. జగన్ పై కుడా ఏపీ వ్యాప్తంగా పలువురు వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం హంగు ఆర్భాటాలు, సామూహికంగా చేయల్సినది కాదని.. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ చేయాల్సిన కార్యక్రమమంటూ పేర్కొంటున్నారు.