తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ ప్రక్రియను నిలిపివేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరపనున్నట్లు తెలిపింది. కాగా కార్డ్ విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రం యథాతథంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని సర్కార్ స్పష్టం చేసింది.
ఆధార్, కులం, కుటుంబసభ్యుల వివరాలు, సామాజిక హోదా వంటి వివరాలను తొలగించి మాన్యువల్‌ను సవరించేదాకా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబరు నమోదు నిలిపివేయాలని హైకోర్టు తాజగా ఆదేశించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న స్లాట్ బుకింగ్ మొదలవ్వగా.. 14 నుంచి రిజిస్ట్రేషన్ సేవలు కొనసాగాయి.