తెలంగాణ ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌ - Tolivelugu

తెలంగాణ ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణ‌లో వాయిదా ప‌డిన వివిద ప్రవేశ ప‌రీక్షల తేదీల‌ను ఖ‌రారు చేసింది తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి. లాక్ డౌన్ నుండి ప్ర‌భుత్వం స‌డ‌లింపులు ఇస్తున్న నేప‌థ్యంలో విద్యా సంవ‌త్స‌రానికి ఇబ్బంది కాకుండా కొత్త తేదీల‌ను ప్ర‌క‌టించింది.

క‌రోనా వైరస్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో… భౌతిక దూరం పాటించ‌టంతో పాటు, పరీక్ష కేంద్రాల‌ను శానిటైజ్ చేసి విద్యార్థుల‌కు ఇబ్బంది కాకుండ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌క‌టించింది.

తెలంగాణ‌లో ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల షెడ్యూల్ తేదీలు

జులై 4 ఈసెట్
జులై 6 నుండి 9 వ‌ర‌కు ఎంసెట్
జులై 10 లాసెట్
జులై 13 ఐసెట్
జులై 15 ఎడ్ సెట్

Share on facebook
Share on twitter
Share on whatsapp