గ్రేటర్ లో గెలిపించాలంటూ కాంగ్రెస్ ఎన్నికల మెనిఫెస్టోను ప్రకటించింది. కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మాణికం ఠాగూర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ తదితరులు గ్రేటర్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు
వరదల నివారణకు చర్యలు తీసుకోవటం- అత్యాధునిక పద్ధతులు
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చటం
విద్యార్థులు, మహిళలకు మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణం
ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు చర్యలు
అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు
సొంత స్థలం ఉండి, ఇల్లు కట్టుకునే వారికి 8లక్షల ఆర్థిక సహాయం
నాయీబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, రజకుల దుకాణాలకు ఉచిత విద్యుత్
30 వేల లీటర్ల వరకు నల్లా నీళ్లు వాడుకునే వారికి ఉచితంగా నీటి సరఫరా
ఉచితంగా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్
రాత్రి 10 గంటలకే బార్‌లు, మద్యం దుకాణాలు మూసివేత
జీహెచ్ఎంసీలో అవినీతిని అరికట్టేందుకు లోక్‌పాల్ వ్యవస్థ అమలుచేస్తాం
ఔటర్ రింగ్‌రోడ్ వెలుపల బహుళ అంతస్తుల టవర్లకు అనుమతులు
హోర్డింగ్‌లపై గుత్తాధిపత్యం తొలగింపునకు జీవో 68ను రద్దు చేస్తాం