వేణుగోపాల్ యాదవ్, TPCC సంయుక్త కార్యదర్శి
తెలంగాణ రాష్ట్రంలో మేధావులు ప్రజాసంఘాలు ఉన్నట్లా? లేనట్లా?. ఉంటే ఆ సంఘాలు ఏమి చేస్తున్నాయ్… ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు సభలో ఉద్యోగుల పనితీరు ప్రస్తావిస్తూ కుక్క, తోక దేనిని ఏది ఊపుతుంది అంటూ ప్రశ్నించారు. అయినా ఉద్యోగ సంఘాలలో చలనం లేదు కారణం ఏమిటి? పాతరోజులలో ఇదే వ్యాఖ్యలు ఎవరు చేసినా ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలు, భోజన విరామ ధర్నాలు ఉండేవి. కాని ఇప్పుడు ఆవేమిలేవు. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి పెట్టింది పేరు, పౌరుషానికి కేరాఫ్ అడ్రస్, ఉద్యమాలకు నిలయం. అలాంటి తెలంగాణలో నేడు భజన సంఘాలు ఎక్కువయ్యాయి. ఉద్యమసంఘాలు, ప్రజాసంఘాలు తెలంగాణ వచ్చాక కేసీఆర్ కి భజన సంఘాలు గా సంఘ నాయకులు ప్రభుత్వానికి బాకావుదేవారిగా మారిపోయారు. కేవలం నాయకత్వ స్థానంలో ఉన్నవారి వ్యక్తిగత ప్రయోజనం కోసం, వారి పదవులకోసం సంఘాలను నిర్వీర్యం చేసారు. ప్రభుత్వం ఏమిచేసినా ముఖ్యమంత్రి ఉద్యోగులను ఏమి అన్నా సమర్ధించడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ చాలా ముందుచూపుతో వ్యూహత్మకంగా ఉద్యమ సమయంలో ప్రజాసంఘాలను, ఉద్యోగ సంఘాలను, కుల సంఘాలను, మేధావులను ఇలా అందరిని ఇన్వాల్వ్ చేసాడు. తెలంగాణ వచ్చాక శ్రీనివాస్ గౌడ్ కి ఎమ్మెల్యే పదవి,స్వామిగౌడ్ కి మండలి చైర్మన్,దేవీప్రసాద్ కు కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఇలా కొంతమందికి పదవులు ఇవ్వగానే అందరూ సర్దుకున్నారు. నెక్ట్స్ టర్మ్ లో మాకు వస్తాయన్న భ్రమలలో మిగిలినవాళ్ళు పడ్డారు. ఉద్యోగస్థులు కుడా మాకు ఏదికావలంటే అది కేసీఆర్ ఇస్తాడన్న ఆశలతో ఉన్నారు. కానీ కాలం గడుస్తున్నకొద్ది ఆశలు ఆవిరి అవుతున్నాయి. అసహనం పెరుగుతుంది. అలాగని ఉద్యమించే పరిస్థితులు లేవు. నాయకులు కేసీఆర్ పట్ల, ప్రభుత్వం పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఆందోళనలు అంటే ఆమడదూరం పోతున్నారు. నాయకుల వైఖరితో ఉద్యోగులు విసిగిపోయారు. ఎప్పుడు ఏ పరిణామాలు జరుగుతాయో వేచిచూడాలి. ప్రస్తుతం ఆర్ టి సి సంఘాల పరిస్థితి కూడా అలాగే ఉంది. నష్టాలలో ఉన్నఆర్టీసీ ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జీతాలు కూడా ఇవ్వలేని స్థితి ఉంది. కార్మికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొన్ని సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చాయి. కాని గుర్తింపు పొందిన సంఘం టీ ఆర్ ఎస్ కి అనుబంధం గా ఉన్న టిఎంయూ మాత్రం వెనుకా ముందు ఆడుతుంది. ఎప్పుడో ఒకసారి ఆర్ టి సి కారిమ్మికుల సమ్మె సందర్భంగా నాటి ఎన్.ఎం.యూ నాయకుడు అనుసరించిన మెతక వైఖరి పై ఆగ్రహించిన కార్మికులు ఆయన ఇంటిపై, కారుపై దాడి చేసారని గుర్తు చేసుకుంటున్నారు. గుర్తింపు సంఘం నాయకుడు అశ్వత్థామ రెడ్డి ఇలాగే చేస్తే నాటి పరిణామాలు పునరావృతం అవుతాయంటున్నారు. మరోవైపు తెలంగాణ సమయంలో కీలక పాత్ర పోషించిన మేధావులు ఇప్పుడు నిద్రాణమైనారని అనుకుంటున్నారు. మేధావులలో కొందరికి కెసిఆర్ పదవులు కట్టబెట్టారు. ఉద్యమ సమయంలో లెఫ్ట్ పోజు పెట్టిన మేధావులు కేసీఆర్ పదవులు ఇవ్వగానే పెదవులు ముసారన్న విమర్శ ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి భజన చేయడం, ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్లకు కౌంటర్ ఇవ్వడం, ప్రభుత్వానికి రక్షణ కవచంలా పనిచేయడం పనిగా పెట్టుకున్నారన్న విమర్శలను మూటకట్టుకుంటున్నారు. ఎవరెవరు ఆ పనిచేస్తున్నారో ఎవరెవరు కేసీఆర్ అమ్ములపొదిలో అస్త్రాలుగా మరారో, ఎవరికి ఎటువంటి పదవులుదక్కాయో అందరికి తెలిసిందే. వీళ్ళు ఇప్పటికి సోకాల్డ్ మేధావులుగా చెలామణి అవుతున్నారని జనం తిట్టుకుంటున్నారు. ఉద్యమ సమయంలో వారు చెప్పిన మాటలు… రాసిన వ్యాసాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిదని, అప్పుడైన వారిలో కొద్దిగయిన జ్ఞానోదయం అవుతుందేమో చూడాలి అంటున్నారు. కుల సంఘాలను కూడా కేసీఆర్ ఊహాత్మకంగా కట్టడిచేశారు. గొర్రెలు-చాపలు-బర్రెలతో కుల సంఘాలకు భవన్ ల నిర్మాణం పేరుతో వాళ్ళను బుట్టలో వేసుకున్నడాని జనం అనుకుంటున్నారు. తన మాట వినని కృష్ణమాదిగ లాంటి వాళ్ళ పైన నిర్బంధాన్ని ప్రయోగించో లేక ఎమ్మార్పీఎస్ ని చీల్చి బలహీనపర్చడం చేసాడని తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మార్పీఎస్ నాయకుల చేత కృష్ణమాదిగ మీద దాడిచేయించి, కృష్ణమాదిగ ను బలహీనపర్చడం చేసాడని ఆ తరువాత తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మార్పీఎస్ నాయకులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా పక్కన పెట్టాడని చెప్పుకుంటున్నారు. తన క్యాబినెట్ లో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఆ సామాజిక వర్గంలో రియాక్షన్ రాకుండా కేసీఆర్ చేయగలిగాడాని గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. టిటిడి బోర్డు సభ్యులుగా తెలంగాణ నుండి ముగ్గురు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారికి అందునా పారిశ్రామిక వేత్తలకు ఇవ్వడం అంటే ఏ కుల సంఘాలు నన్ను ప్రశ్నించలేవు అన్న ధీమాతోనే తన సామాజిక వర్గనికి చెందిన ముగ్గురు పారిశ్రామిక వేత్తలకు టీటీడీ బోర్డు సభ్యులు గా నియమించుకున్నాడని జనం చర్చించ్చుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలేవున్నాయి. అయితే ఎప్పటికి ఈ పరిస్థితి వుండదు. సమాజంలో అసహనం ఎక్కువైతే తిరుగుబాటు తప్పదు అంటున్నారు విశ్లేషకులు. ఇది చరిత్ర అంటూ పాత పోరాటాలను, ఉద్యమాలను గుర్తుచేస్తున్నరు. తెలంగాణ ఉద్యమం కూడా అణిచివేత, అసహనం, అన్యాయం, అసమానతల నుండే పుట్టిందని చెబుతున్నారు. రేపు కుడా అదే జరుగుతుంది అంటున్నారు.