రవిప్రకాశ్‌ను కలిసిన రేవంత్ - Tolivelugu

రవిప్రకాశ్‌ను కలిసిన రేవంత్

telangana congress leader revanth reddy met ravi prakash at chanchalguda jail, రవిప్రకాశ్‌ను కలిసిన రేవంత్

హైదరాబాద్: తెలంగాణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన టీవీనైన్ రవిప్రకాశ్‌కు మద్ధతుగా జర్నలిస్టులు కదలుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. సోషల్ మీడియాలో రవిప్రకాశ్‌కు మద్ధతుగా వందలాది పోస్టులు పెడుతున్నారు. రవిప్రకాశ్ అభిమాన సంఘాల పేరిట టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తూ అక్రమ అరెస్టుకు నిరసనలు తెలియజేస్తున్నారు.

మరోపక్క అరెస్టు కాబడి చంచల్‌గూడ జైలులో వున్న రవిప్రకాశ్‌ను చూసేందుకు ఆయన అభిమానులు, జర్నలిస్టులు, రాజకీయ నేతలు వెల్లువలా అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి పెద్దసంఖ్యలో తరలివస్తున్న అభిమానుల్ని, నేతల్ని చూసి జైలు అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. గతంలో చంచల్‌గూడ జైలులో వున్నప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ నేతకు కూడా ఈ స్థాయిలో అభిమానులు రాలేదని అక్కడివారు చెబుతున్నారు. అక్కడ కొంతమంది పోలీసు ఉద్యోగులు పైనుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రవిప్రకాశ్ అభిమానుల్ని చెదరగొడుతున్నారు.

telangana congress leader revanth reddy met ravi prakash at chanchalguda jail, రవిప్రకాశ్‌ను కలిసిన రేవంత్

ఇలావుంటే కాంగ్రెస్ యువనేత రేవంత్‌రెడ్డి చంచల్‌గూడ కారాగారంలో వున్న రవిప్రకాశ్‌ను కలిసి మద్ధతు తెలిపేందుకు అక్కడికి వచ్చారు. చాలాసేపు రవిప్రకాశ్‌తో ప్రస్తుత పరిణామాల గురించి మాట్లాడినట్టు సమాచారం. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో చిరునవ్వుతో మాట్లాడుతున్న రవిప్రకాశ్‌ను చూసి రేవంత్‌రెడ్డి ఆశ్చర్యపోయారు. మీ వెనుక మొత్తం తెలంగాణ సమాజం వుందని ధైర్యం చెప్పి వచ్చారు.telangana congress leader revanth reddy met ravi prakash at chanchalguda jail, రవిప్రకాశ్‌ను కలిసిన రేవంత్

 

Share on facebook
Share on twitter
Share on whatsapp