తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ రోజు గాంధీభవన్ కు రాకుండా కాంగ్రెస్ నేతలను అడ్డుకోవటం దారుణమన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నగర కమీషనర్ అంజనీ కుమార్ ఫోన్ లో తనతో దురుసుగా మాట్లాడారని ఆరోపించారు ఉత్తమ్. సీపీ అంజనీ కుమార్ అవినీతిపై దర్యాప్తు జరిపించాలని గవర్నర్‌ను కోరారు ఉత్తమ్. ఏపీ క్యాడర్ లో ఉన్న అంజనీ కుమార్ ఇంకా తెలంగాణలో కొనసాగుతున్నారని, ఆర్ఎస్ఎస్, ఎంఐఎం సభలకు అనుమతులిచ్చి, కేవలం కాంగ్రెస్ సభలకు అనుమతి నిరాకరిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.