ప్రాజెక్టుల‌పై కాంగ్రెస్ పోరు బాట‌ - Tolivelugu

ప్రాజెక్టుల‌పై కాంగ్రెస్ పోరు బాట‌

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విష‌యంలో ఏపీ జారీ చేసిన జీవో తెలంగాణ‌లో రాజ‌కీయ వేడిని ర‌గిలిస్తూనే ఉంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వంపై అనేక ఆరోప‌ణ‌లు చేస్తున్న కాంగ్రెస్ ప్ర‌త్య‌క్ష పోరాటానికి సిద్ధం అయ్యింది. జూన్ 6న గోదావ‌రి పెండింగ్ ప్రాజెక్టుల‌పై కాంగ్రెస్ నేత‌లు దీక్ష‌ల‌కు దిగ‌బోతున్నారు.

high tension at huzur nagar

జూన్ 2న పెండింగ్ ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్‌ నేతల నిరసన దీక్ష చేపడుతారని ఉత్తమ్ తెలిపారు. జూన్‌ 3, 4 తేదీల్లో రైతులతో జిల్లా కాంగ్రెస్ కమిటీల సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ది తుగ్లక్ పాల‌న చేస్తున్నారంటూ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. గాంధీబ‌వ‌న్ లో ముఖ్య‌నేత‌ల‌తో సమావేశ‌మైన ఉత్తమ్… కేసీఆర్ నిర్భంద వ్య‌వ‌సాయంపై మండిప‌డ్డారు. ప‌త్తి వేయాలంటే 7వేల మ‌ద్ధ‌తు ధ‌ర చెల్లిస్తామ‌ని ముందుగా హామీ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ తో పాటు మాజీ మంత్రి జానా రెడ్డి, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి దీక్ష చేయ‌బోతున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp