హైదరాబాద్: 14 రోజుల కంటే తక్కువ రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరిగితే ఆ సెషన్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇక చెల్లదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ రూల్స్ బుక్‌లోనే ఈ నిబంధన ఉందని, కావాలంటే తెప్పించి చదువుకోండని అధికారపక్షానికి క్లారిటీ ఇచ్చారు. సెషన్స్ ఎన్ని రోజులు జరగాలన్నది రెండు పార్టీలు ఒప్పుకుంటే సరిపోదు, ఇది నిబంధనలకు విరుద్ధమే.. అని రేవంత్ ఇవాళ అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ చెప్పారు. పదిరోజులలో బడ్జెట్ సమావేశాలు ముగియడం అంటే పెళ్లి లేకుండా సహజీవనం చేసినట్లే.. అని కామెంట్ చేశారు. కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు కూడా కొట్టేయడం ఖాయమని అన్నారు. ఇంకా రేవంత్ ఏమన్నారంటే..
- విద్యుత్ అంశంపై సభలో చర్చ జరిగే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం సరికాదు ..
- రాష్ట్రంలో ఇంత బర్నింగ్ టాపిక్‌గా ఉన్న విద్యుత్ అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదని మా ఎమ్మెల్యేలను అడిగేందుకు అసెంబ్లీకి వచ్చా ..
- విద్యుత్ అంశంపై ప్రభుత్వం ఏకపాత్రాభినయం చేస్తుంటే కాంగ్రెస్ సభ్యులు సభలో లేకపోతే ఏం సందేశం ఇచ్చినట్లు…
- గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లిన మా వాళ్ళు సీఎల్పీ సభ్యుడిగా నాకు సమాచారం ఇవ్వలేదు ..
- కాంగ్రెస్‌లో ఎప్పుడు పదవి వస్తుందో, ఎప్పుడు పదవి పోతుందో ఎవరికి తెలుసు..
- హుజుర్ నగర్ ఉపఎన్నికకు ఇంకా అధిష్టానం ఎవరిని ఎంపిక చేయలేదు..
- హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో పోటీకి శ్యామల కిరణ్‌రెడ్డిని ప్రతిపాదిస్తున్నా, అతను అక్కడ లోకల్ ..
- యురేనియంపై పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు, ఆయన నియమించిన యురేనియం కమిటీ చైర్మన్ వీహెచ్ చెప్పినప్పుడు నేను వాళ్ళ వెంట వెళ్ళాను, తప్పేముంది..
- పీసీసీ చీఫ్ ఉత్తమ్, పార్టీ నియమించిన యురేనియం కమిటీ చైర్మన్ వీహెచ్, పవన్ మీటింగ్‌కు వెళ్ళినప్పుడు నేను వాళ్ళ వెంట వెళ్ళాను..
- యురేనియంపై సంపత్ కుమార్‌కు ఏబీసీడీలు కూడా తెలియవు..
- అక్కడికి మేము ఎందుకు పోయామని అడిగేవాళ్ళు, వాళ్ళు ఆ మీటింగ్‌కు ఎందుకు వచ్చారు..
- పవన్ కళ్యాణ్ సంపత్ కుమార్‌తో సెల్ఫీ ఫోటో దిగేందుకు అవకాశం ఇవ్వలేదని ఆ కోపం నాపై చూపిస్తే ఏం లాభం..
- ఏఐసిసి కార్యదర్శులుగా ఉండి, మహారాష్ట్రలో ఎన్నికలు వదిలిపెట్టి, సంపత్, వంశీలకు ఈ మీటింగ్‌లో ఏం పని..
- యురేనియం ఇష్యూపై స్థానికకంగా నేను టీడీపీలో ఉండగానే పోరాటం ప్రారంభించాను..
- ఇప్పుడు ఆ పోరాటంలో కలిసొచ్చేవాళ్ళు వస్తారు, రానివాళ్ళు రారు..
- కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రులు చెబుతున్నారు, మరి ఆ అవినీతిపై విచారణ జరపకుంటే వారికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లే కదా..
- రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై నా దగ్గర ఉన్న ఆధారాలను త్వరలోనే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు అందజేస్తా..