కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతుల ఉద్యమం కొనసాగుతుంది. ఇందుకు మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతిపత్రం అందజేసింది.
ఈ ర్యాలీలో తెలంగాణ నుండి ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకొండి అని రాసి ఉన్న ప్లకార్డులను చేతపట్టి రాష్ట్రపతి నిలయం వరకు మిగతా కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పాదయాత్రగా వెళ్లారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారికి అన్యాయం చేసే ఎలాంటి చట్టాలకు అయినా వ్యతిరేకంగా పోరాడుతుందని నేతలు స్పష్టం చేశారు.