కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత రాజీనామా చేశారు. ఏఐసీసీ సభ్యుడు, తెలంగాణ పీసీసీ ట్రెజరర్ గూడూరు నారాయణరెడ్డి పార్టీని వీడారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. పార్టీలోని అన్ని పదవులకూ రాజీనామా చేస్తున్నట్టు అందులో తెలిపారు. కొద్ది రోజుల క్రితం నుంచే నారాయణ రెడ్డి కాంగ్రెస్ వీడనున్నారనే ప్రచారం జరగుతోంది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారని అంటున్నారు.
1981లో తాను విద్యార్థిదశలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నట్టు లేఖలో వెల్లడించారు గూడూరు. చిత్తశుద్ధి గల సైనికుడిలా పార్టీని అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశానని చెప్పారు. పార్టీ అధిష్ఠానం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలన్నింటినీ వందశాతం నిర్వర్తించానని లేఖలో చెప్పుకొచ్చారు.