కరోనాను కట్టడికి కేంద్రం తీసుకొన్న లాక్ డౌన్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ అధిష్టానం లేఖ కుడా రాసిందని ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి తాము కుడా మద్దతు తెలిపామని చెప్పారు. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉదోగుల వేతనాల్లో కోత విధిస్తూ తీసుకొన్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. యుద్ద సమయంలో కుడా పభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించలేదని..అలాంటిది ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వేతనాలో కోత విధించడం సమంజసం కాదన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పుకొనే కేసీఆర్ ..వారం రోజులపాటు లాక్ డౌన్ ఉంటె జీతాలు ఇవ్వలేని స్థితికి తెలంగాణ దిగాజరిందంటే కేసీఆర్ పాలన ఉందో అర్ధం చేసుకోవచ్చునని చెప్పారు ఉత్తమ్. ప్రైవేట్ సంస్థల వేతనాలు పూర్తిగా ఇవ్వాలని ప్రకటించిన కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా కోత పెడతారని ప్రశ్నించారు. కరోనా నివారణకు ప్రభుత్వ ఉద్యోగులు-మెడికల్ అండ్ హెల్త్-పోలీస్ ఉద్యోగులు రిస్క్ లో పనులు చేస్తున్నారని.. ప్రాణాలను పణంగా పెట్టిన వారి జీతాలు కట్ చేయడం సమంజసం కాదని తెలిపారు. ఒక వైపు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు.
కోవిడ్ నివారణకు లాక్ డౌన్ కు మద్దతు తెలుపుతున్నామనరు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ. కాళేశ్వరం ప్రాజెక్టు 2016 లో మొదలు పెట్టి 80 వేల కోట్లు ఖర్చు చేశారని..మళ్ళీ 22 వేల టెండర్లు పిలిచారని చెప్పారు.కాళేశ్వరం కింద ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు లేదని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంటూనే కాళేశ్వరం ప్రాజెక్టుకు 22వేలకు టెండర్లు పిలవడం న్యాయమేనా? అని ప్రశ్నించారు దామోదర రాజనర్సింహ.
కరోనా కోసం ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెడుతానన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు బీజేపీ నేత డీకే అరుణ. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్,పి ఆర్ సి ఇవ్వకుండా వేతనాలో 50 శాతం కోత విధించడం ఏమిటని ప్రశ్నించారు. స్వయంగా ప్రధాన మంత్రి, లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగస్తుల, కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని చెప్పారని ఆమె గుర్తు చేశారు. మీ అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇలా తయారు అయిందని కేసీఆర్ పై మండిపడ్డారు. వేతనంపై ఆధారపడి బ్రతికే ఉద్యోగుల వేతనాల్లో ఏక పక్షంగా 50 శాతం కోత విధిస్తే కుటుంబాల జీవన పరిస్థితి అస్తవ్యస్థమౌతుందని తెలిపారు.