తెలంగాణలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. టెస్టుల సంఖ్య పెరిగే కొద్ది నెమ్మదిగా కేసుల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 57,405 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 631 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇదే నిన్న 53,686 మందికి పరీక్షలు చేస్తే 609, మొన్న 51,562 టెస్టులు చేస్తే 565 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఇంకా టెస్టులు పెంచితే కేసులు కూడా పెరగొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అటు కరోనా కారణంగా నిన్న ఇద్దరు మృతి చెందగా.. నిన్న 802 మంది కోలుకున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో కరోనా వైరస్ పూర్తి వివరాలను పరిశీలిస్తే..
ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసులు… 2,72,123
మృతుల సంఖ్య …1,467
కోలుకున్న బాధితుల సంఖ్య …2,61,830కి
ప్రస్తుతం యాక్టివ్ కేసులు… 8,826
ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు.. 56.62 లక్షలు