తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లో 34,482మందికి కరోనా వైద్య పరీక్షలు చేయగా… 216 మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 3,00,933కి చేరింది. కొత్తగా 168 మంది కోలుకున్నారు. మరో ఇద్దరు మరణించారు.
తెలంగాణలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 2,97,363కి చేరగా… మరణాల సంఖ్య 1652కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1918యాక్టివ్ కేసులున్నాయి.