తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత కొంతకాలంగా రోజుకు రెండు వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుంది. తాజాగా గడిచిన 24గంటల్లో 2751కొత్త కేసులు రాగా, 9మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,166కు చేరగా, మరణాల సంఖ్య 808కి చేరింది.
రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30,008ఉండగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 89,350 కు పెరిగింది. తాజాగా వచ్చిన కేసుల్లో హైదరాబాద్ లోనే 432 కేసులొచ్చాయి. మొన్నటి వరకు కాస్త తగ్గినట్లే అనిపించిన గ్రేటర్ కేసుల్లో మళ్లీ భారీగా పెరుగుదల కనపడుతుంది.