తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కరోనా కారణంగా మరో ఇద్దరు మృతి చెందారు. ఇక తాజాగా మరో 346 మంది కోలుకున్నారు.
తెలంగాణలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 2,91,872కి చేరింది. మొత్తం మరణాలు 1579కి పెరిగాయి. కరోనా నుంచి ఇప్పటివరకు 2,86,244 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,049 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 2,281 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.