తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరిగింది. కొత్తగా 46,694మందికి పరీక్షలు చేయగా… 627మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మరో 721మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఈ 24గంటల్లో మరో నలుగురు మరణించారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు- 2,80,822
యాక్టివ్ కేసుల సంఖ్య- 6,942
డిశ్చార్జ్ కేసుల సంఖ్య- 2,72,370
మరణించిన వారి సంఖ్య- 1510
తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో 30శాతం అంటే 84,247మందికి ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.