తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అదేస్థాయిలో కొనసాగుతోంది. రాష్ట్రంలో నిన్న 51 వేల 247 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 2,058 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 908 మంది ఫలితాలు రావాల్సి ఉంది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా 60 వేలు దాటింది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 10 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 984 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 277 వెలుగుచూశాయి. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 143, కరీంనగర్- 135, వరంగల్ అర్బన్- 108, సిద్దిపేట- 106, ఖమ్మం -103, మేడ్చల్ జిల్లాలో 97 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
కరోనా నుంచి నుంచి నిన్న 2,180 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో రికవరీల సంఖ్య లక్షా 29 వేలకు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30 వేల 400 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 23 వేల 534 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22.20 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.