తెలంగాణలో రెండో దశ కరోనా విజృంభణ, వివిధ దేశాల నుండి ప్రయాణికులు వస్తున్న నేపథ్యంలో… కరోనా నిపుణుల కమిటీ అత్యవసరంగా భేటీ కానుంది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తప్పదంటూ పలువురు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన మద్యాహ్నాం 3గంటలకు భేటీ జరగనుంది.
కొత్తగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్టీ-పీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలన్న ఐసీఎంఆర్ నిబంధనలు, ఎయిర్ పోర్టుల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు, ట్రెస్-టెస్ట్-ట్రీట్ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.