తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 58,029మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 495 కొవిడ్ సోకిందని నిర్ధారణ అయ్యిందని ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.
వైరస్ ప్రభావంతో మరో ఇద్దరు మృత్యువాతపడగా… మరో 247 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 1,870 బాధితులు కోలుకుంటుండగా, తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 142 కేసులు గ్రేటర్ లో నమోదయ్యాయి.
తాజాగా నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,804కు చేరగా, మృతుల సంఖ్య 1,685కు చేరింది.