రాష్ట్రంలో కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 43,413మందికి కరోనా పరీక్షలు చేయగా 415 కేసులు నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. చికకిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 2,86,354 కరోనా కేసులు నమోదవ్వగా.. మొత్తం 1,541 మంది మరణించారు. కరోనా నుంచి మరో 316 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుండి కోలుకొని 2,78,839 మంది బాధితులు కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 5,974 యాక్టివ్ కేసులుండగా.. 3,823 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 91 కరోనా కేసులు నమోదయ్యాయి.