తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లో ఏకంగా 1078 కొత్త కేసులు వచ్చాయి. మరో ఆరుగురు మృతి చెందగా, మరో 331మంది వైరస్ నుండి కోలుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య- 3,10,819
యాక్టివ్ కేసుల సంఖ్య- 6900
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 3,02,207
మరణాలు- 1682
కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ లో 283కేసులు వచ్చాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 59,705మందికి వైద్య పరీక్షలు చేశారు.