ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈరోజు యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు సోమేష్ కుమార్ కు ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు, లడ్డూ ప్రసాదం అందజేశారు. దర్శనానంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి, స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానాలయం సహా టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాలసీతో సంబంధం లేకుండా ప్రత్యేక కోటాలో యాదగిరిగుట్ట కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న జర్నలిస్టుల విజ్ఞప్తికి చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ సానుకూలంగా స్పందించారు.