తెలంగాణ రాష్ట్రానికి పెద్ద సమస్య గంజాయి సమస్య అన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. గంజాయి వల్లనే ప్రధానంగా కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. డ్రగ్ అరికట్టే విషయంలో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. నూతన టెక్నాలజీతో 25వేల సైబర్ క్రైమ్ కేసులను డిటెక్ట్ చేయగలిగామని అన్నారు డిజిపి. ఈ ఏడాదిలో కొత్తగా ఉద్యోగాలు పోలీస్ శాఖలో ఇవ్వలేదని గత ఏడాదిలో మిగిలిన వారికి 3వేలకు పైగా రిక్యుట్మెంట్ చేసుకున్నామని అన్నారు.
పోలీస్ శాఖ వెల్ఫేర్ ను ప్రభుత్వం తన భుజాలపై వేసుకోని నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది 11 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయన్నారు డీజీపీ.