గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారని నమ్మకమైన సమాచారం అందిందన్నారు రాష్ట్ర పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి. మత ఘర్షణలకు కొంతమంది కుట్ర పన్నారని… విచారణ కొనసాగుతుందన్నారు. కొన్ని శక్తులు హైదరాబాద్ లో శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఇక నేతలు మాట్లాడుతున్న హేట్ స్పీచ్ లను న్యాయశాఖ సమీక్ష కోసం పంపామని, రెచ్చగొట్టే ప్రసంగాలను ఊపేక్షించమన్నారు. ఇప్పటి వరకు 50కేసులు నమోదయ్యాయని, ప్రజలు ఎవరూ పుకార్లను నమ్మొద్దన్నారు. సోషల్ మీడియాపై నిఘా ఉందని… 50వేలకు పైగా పోలీసు బందోబస్తుతో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేశామన్నారు.