ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఆంధ్రా వాళ్ళే ఎక్కువగా ఉంటారు అనే భావన ఉండేది. అయితే కొన్నాళ్ళుగా కాస్త తెలంగాణా ప్రాంతం వాళ్ళ హవా కూడా పెరుగుతూ వచ్చింది. సినిమాల్లో యాస కూడా ఎక్కువగా తెలంగాణానే వినపడుతుంది. అప్పట్లో దర్శకులు అంటే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉండేవారు. కాని ఇప్పుడు ట్రెండ్ మారి తెలంగాణా నుంచి వచ్చిన వాళ్ళు స్టార్ దర్శకులు అవుతున్నారు.
సందీప్ రెడ్డి వంగా
అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ ఒక సంచలనం అయ్యారు. ఈయనకు ఇప్పుడు స్టార్ హీరోలతో చేసే అవకాశాలు వస్తున్నాయి. సందీప్ తెలంగాణా ప్రాంతం నుంచే వచ్చాడు.
హరీష్ శంకర్
మిరపకాయ్ సినిమాతో డైరెక్టర్ గా మారిన హరీష్ శంకర్… పవన్ కళ్యాణ్ లాంటి హీరోని ఫ్లాపుల నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఈయన కూడా తెలంగాణా ప్రాంతానికి చెందిన డైరెక్టర్.
సంపత్ నంది
రామ్ చరణ్, గోపి చంద్ వంటి స్టార్ హీరోలతో చేసిన ఈ డైరెక్టర్ కూడా తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తి.
సురేందర్ రెడ్డి
పలువురు హీరోలకు మరుపురాని హిట్ లు ఇచ్చిన ఈ డైరెక్టర్ ది తెలంగాణానే కావడం విశేషం. ఇప్పుడు రామ్ చరణ్ కోసం ఒక కథ రెడీ చేస్తున్నాడు.