– ప్రపంచ మోసగాళ్ల దివస్ కూడా!
– కొండా విశ్వేశ్వర్ రెడ్డి హ్యాష్ టాగ్ !
– ఆరంభంలో కేసీఆర్ బర్త్ డేనే ఫస్ట్…
– రెండో స్థానంలో ద్రోహి దివస్
– క్రమంగా ఐదో స్థానానికి బర్త్ డే ట్యాగ్
– రగిలిపోయిన తెలంగాణ నిరుద్యోగులు
– గులాబీ ఫ్లెక్సీలమయంగా తెలంగాణ
– కాంగ్రెస్ నిరసనలు..నిరుద్యోగుల మద్దతు
– ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధాలు
టీఆర్ఎస్ నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన వారి అధినాయకుడి జన్మదిన వేడుకలు..తెలంగాణవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.ఏడేళ్ పాలనలో జనాన్నిమోసం తప్ప మరేమీ చేయని కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భారీ ఎత్తున నిరసనలు తెలియచేయాలన్నపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ వీలైతే అక్కడ నిరసనలకు దిగారు. కొన్నిచోట్ల గాడిదలతో కేక్ కట్ చేయించే సీన్ లు ఏర్పాటుచేశారు.అటు.. ఉద్యోగాల్లేక, నోటిఫికేషన్లు రాక కడుపుమంటతో రగిలిపోతున్న నిరుద్యోగులు,విద్యార్థులు ..ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా సహా రాష్ట్రమంతటా కేసీఆర్ దిష్టిబొమ్మల్నిదగ్ధం చేసే ప్రయత్నం చేశారు.అటు..రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలను, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.
మరోవైపు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్ని ఎంతో అట్టహాసంగా జరుపుకున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. రాజధాని హైదరాబాద్ లోని ప్రతీ జంక్షన్ లో పెద్ద పెద్ద కటౌట్స్, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లాల్లోనూ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఇటు సోషల్ మీడియాలోనూ కేసీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువ కొనసాగింది.దీంతో హ్యాపీ బర్త్ డే కేసీఆర్ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది.అయితే..దీనికి పోటీగా తెలంగాణ ద్రోహి దివస్ అనే హాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ అయింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి..కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.తెలంగాణ ద్రోహి దివస్,ప్రపంచ మోసగాళ్ల దినోత్సవం అంటూ రెండు హాష్ ట్యాగ్స్ ను పెట్టి.. ప్రజలే నిర్ణయించండి అని కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఎక్కువమంది తెలంగాణ ద్రోహి దివస్ కే జై కొట్టారు.దీంతో అది ట్రెండింగ్ లో నిలిచింది.
A Twitter Spaces discussion on KCRao & Constitution. It ended with- What should tommorow be declared?#TelanganaDrohiDiwas
or#WorldFraudstersDayPlease decide.
Unemployed Youth Defrauded – Rs.3016
Daliths Defrauded
-3 acres land
Flood victims Cheated
-Rs10k
Farmers? Teachers?— Konda Vishweshwar Reddy (@KVishReddy) February 16, 2022
కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ స్పందిస్తూ..తెలంగాణ ద్రోహి దివస్ నే తాను సమర్ధిస్తానని విశ్వేశ్వర్ రెడ్డిని ట్యాగ్ చేశారు. ప్రజలు కేసీఆర్ ను మొదటి నుంచీ నమ్మారు..ఆయన వెన్నుపోటు పొడిచారు అంటూ ట్వీట్ చేశారు.
హ్యాపీ బర్త్ డే కేసీఆర్, తెలంగాణ ద్రోహి దివస్ హాష్ ట్యాగ్ లు పోటాపోటీగా ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. చివరకు తెలంగాణ ద్రోహి దివస్ రెండో ప్లేస్ కు చేరింది. హ్యాపీ బర్త్ డే కేసీఆర్ మొదట ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. మెల్లిమెల్లిగా ఐదో స్థానానికి పడిపోయింది.