తెలంగాణ విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. జేఎన్టీయూ టీఎస్ ఎంసెంట్ 2023 కోసం ఇంగ్లీష్ లోనే ప్రశ్నా పత్రం ఉండాలనే నిబంధనను సడలించింది. మే 7 నుంచి 11 వరకు జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు ఇంగ్లీష్-తెలుగు, ఇంగ్లీష్-ఉర్దూ వెర్షన్ లలో ఉంబోతున్నాయి.
టీఎస్ ఎంసెట్ వివిధ సెషన్ లలో నిర్వహించబడుతున్నందున, ప్రశ్నా పత్రాలు వివిధ క్లిష్ట స్థాయిలలో ఉండే అవకాశం ఉంది. దీంతో ఏ స్టూడెంట్ కి నష్టం జరకూడదన్న ఉద్దేశ్యంతో టీస్ ఎంసెట్ 2023లో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ను తీసి వేయాలని నిర్ణయించారు.
స్కోర్ లను సాధారణీకరించేటప్పుడు, అభ్యర్థులు స్కోర్ చేసిన మార్కులను సెషన్ ల వారీగా తనిఖీ చేస్తారు. అలాగే క్వశ్చన్ పేపర్ టఫ్ కారణంగా అభ్యర్థుల మార్కులు తగ్గించబడతాయి. గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది పట్టణ విద్యార్థులు ఎంసెట్ లో ప్రత్యేకంగా ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ను ఎంచుకుంటున్నారు.
గ్రామీణ అభ్యర్థులు మాత్రం ఇంగ్లీష్-తెలుగు లేదా ఇంగ్లీష్-ఉర్దూ వెర్షన్ ను ఎంచుకుంటున్నారు. ఇది గమనించిన తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న జేఎన్టీయూ.. టీఎస్ ఎంసెంట్ 2023 కోసం ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాన్ని మాత్రమే తొలగించాలని నిర్ణయించింది.