గ్రేటర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ గుర్తు ఉన్నవే కాకుండా… పోలింగ్ కేంద్రాల సంఖ్యను సూచించే ముద్రలు వేసినా ఓటుగానే భావించాలి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల సిబ్బందితో ఈసీ సమావేశమైన సందర్బంతో కొందరు ఉద్యోగులు తాము స్వస్తిక్ గుర్తు కాకుండా.. పొరపాటున పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈసీ వాటిని కూడా ఓట్ల కిందే పరిగణిస్తూ.. లెక్కించాలంటూ ఈసీ సూచించింది. ముద్ర మారినా ఓటర్ల ఎంపిక మారే ఆస్కారం లేదంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.